
పయనించే సూర్యుడు న్యూస్(జూలై.26/07/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
తిరుపతి జిల్లా సత్యవేడు గ్రామీణ అభివృద్ధి సంస్థ( వెలుగు) ఆర్థిక కార్యకలాపాల సంబంధించి ఆదాయ వ్యయాలపై శనివారం ఆడిటింగ్ ప్రారంభమయ్యాయి.స్థానిక శ్రీశక్తి భవనంలో వెలుగు ఏపీఎం డాక్టర్ డాంగే యాదవ్ పర్యవేక్షణలో ఆడిటర్ కార్తికేయ బృందం ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మండల మహిళా సమైక్య ఆదాయ ,వ్యయాలు,శ్రీనిధి,సిఐఎఫ్,ఉన్నతి వంటి పథకాలు సంబంధించి 42 గ్రామ సమైక్య సంఘాల ఆర్థిక వ్యవహారాలతో పాటు పాలడైరీ ఆదాయ,వ్యయాలకు సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిటింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే తొలి రోజు సంఘమిత్రలు పలువురు ఆడిటర్కు రికార్డులు,ధ్రువపత్రాలు సమర్పించి ఆడిటింగ్ పూర్తి చేసుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో వెలుగు కోఆర్డినేటర్లు శివకుమార్, పురుషోత్తం,మధుసూదన్,పుల్లయ్య,మంగయ్య, బిఎన్ కండ్రిగ కోఆర్డినేటర్ పలని తదితరులు పాల్గొన్నారు.