
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 జగ్గయ్యపేట ప్రతినిధి భూక్యా కవిత:- జగ్గయ్యపేట పట్టణంలోని వేపలవాగు పరిసర ప్రాంతాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ మరియు జగ్గయ్యపేట పట్టణ అధ్యక్షులు వట్టెం మనోహర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జగ్గయ్యపేట పట్టణంలోని 2వార్డు, 5,6,7,9 వ వార్డు పరిధిలో ప్రవహిస్తున్న వేపల వాగు పరిసర ప్రాంతాలలో పారిశుధ్య పనులు చేపట్టకపోవడంతో ప్లాస్టిక్ వ్యర్ధాలు, చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుందని తెలిపారు. అదేవిధంగా స్థానిక ప్రజలు దోమల బెడదతో అనేక ఇబ్బందులు పడి అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా వేపల వాగు కు వరద నీరు చేరడంతో ప్రాంత ప్రజల ఇళ్లలోకి వరద నీరు చేరి ఆస్తి నష్టం జరిగిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు స్థానిక ప్రజలకు ఎటువంటి ఆర్ధిక సహాయం చేయలేదని తెలిపారు. వేపలవాగు లో పారిశుధ్య పనులు చేయకుండా ఉండటంతో స్థానికులు అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు. నేను స్థానిక 5వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గా ఉన్నప్పటికీ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ కు పలుమార్లు పిర్యాదు చేసిన ఫలితం శున్యమన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వేపల వాగు సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ కి అదేవిధంగా మున్సిపల్ డి ఈకి వినతిపత్రం సమర్పించడం జరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే వేపలవాగు ప్రాంతాన్ని పరిశీలించి పారిశుధ్య సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నట్లు తెలియజేశారు