
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పయనించే సూర్యుడు ప్రతినిధి వచ్చే వేసవికాలం కల్లా ఎక్కడ బోర్లు మరమ్మతు లేకుండా చూస్తామని కంచికచర్ల పంచాయతీ సర్పంచ్ వేల్పుల సునీత శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇందుకోసం ఇప్పటినుంచి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి బోర్ల మరమ్మతులను చేపడుతున్నామన్నారు. మరమ్మతులకు గురైన బోరింగుల వివరాలను సేకరించి, మరమ్మతులకు గురైన బోర్లను సరి చేస్తున్నామన్నారు. ప్రజలకు తాగునీటి పంపిణీతో సమాంతరంగా నీటి అవసరాలకు బోర్లు ఎంతో ఉపయోగంగా నిలుస్తున్నాయన్నారు. అయితే బోర్లు వినియోగించే సమయంలో ప్రజలు సరైన పద్ధతులు పాటించకపోవడంతో తరచూ బోర్లు మరమ్మతులకు గురవుతున్నాయన్నారు. బోరింగుల చుట్టూ పరిశుభ్ర వాతావరణం నెలకొనే విధంగా చూడాలన్నారు. వేసవిలో నీరు ఎంతో అవసరం కావున బోర్లు తరచూ మరమ్మతులు కాకుండా ప్రజలు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.