
శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్ట మహోత్సవము కార్యక్రమంలో పాల్గొన్న : జనసేన నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కూకట్ పల్లి నియోజకవర్గంలోని ప్రభాకర్ రెడ్డి నగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ సాగర్ మరియు కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ ఆంజనేయ, శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ దత్తాత్రేయ, శ్రీ రామలింగేశ్వర, శ్రీ ఆదిత్య నవగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి జనసేన పార్టీ నాయకులు బోగాది వెంకటేశ్వరరావు, కొల్లా శంకర్ , అడబాల షణ్ముఖ,బలిజేపల్లి శంకర్రావు . బిజెపి నాయకులు బూరుగుపల్లె రామ్మోహన్ , సతీష్ గౌడ్ , కాలనీ జనరల్ సెక్రెటరీ దత్తు , వెంకటేష్ ,పవన్ , తదితరులు పాల్గొన్నారు