
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 24
అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,రంపచోడవరం ఐటీడీఏ ఎదుట 10వ,రోజు రిలే నిరాహార దీక్షలు కార్యక్రమానికి ఆదివాసి జేఏసీ కోర్ కమిటీ సభ్యులు కంగాల శ్రీనివాస్ అధ్యక్షతన రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్న వారికి పూలమాల వేసి ప్రారంభించారు.ఈ రిలే నిరాహార దీక్షలను ఉద్దేశించి అల్లూరి సీతారామరాజు జిల్లా పి.డి మరియు పి.ఈ.టిల అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ వి.కృష్ణారావు మాట్లాడుతూ…2025 జనరల్ డీఎస్సీ నుండి షెడ్యూల్డ్ ప్రాంత ఆదివాసీ టీచర్స్ పోస్టులు మినహాయించి,యుద్ధ ప్రాతిపదికన 100% స్థానిక ఆదివాసీ పట్టభద్రులతోనే భర్తీ చేసేందుకు ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్స్ విడుదల చేయాలని,తక్షణమే (టిఏసి)ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేసి తీర్మానం చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించాలని,జీవో నెంబర్ 3కు చట్ట బద్ధత కల్పిస్తామని ఎన్నికల ముందు అరకులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని,వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఎస్టి బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేయాలని,ఐటిడిఏల ద్వారా ట్రైకార్ రుణాలు నిరుద్యోగ యువతకు తక్షణమే మంజూరు చేసి ఉపాధి కల్పించాలని మొదలైన సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ తలపెట్టిన రిలే నిరాహార దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు.మరియు అల్లూరి సీతారామరాజు జిల్లా పి.డి మరియు పి.ఈ.టి అసోసియేషన్ జిల్లా నాయకులు కె.తిరుపతిరావు మాట్లాడుతూ…ఆదివాసీలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం భారత రాజ్యాంగంలోని ఐదవ ఆరవ షెడ్యూల్డ్ లోని
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(1) ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి కోసం పేరా -4 ప్రకారం (టిఎసి) ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కమిటీ ఏర్పాటు చేసి తక్షణమే తీర్మానం చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించి ఆదివాసీ నిరుద్యోగ పట్టవద్రుల భవిష్యత్తును కాపాడాలని టీఎస్ కమిటీ ప్రజా ప్రతినిధులకు, మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ రిలే నిరాహార దీక్షలు కార్యక్రమంలో ఎం.చిన్న స్వామి రెడ్డి,కె.మంగాయమ్మ చవలం శుభ కృష్ణ దొర,ఆదివాసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్,కారం రామన్న దొర,పండా పవన్ కుమార్ దొర,మడకం వరప్రసాద్ దొర,కొమరం కిషోర్ బాబు దొర,యలగాడ నాగేశ్వరరావు,కుంజం అగ్గి దొర,కత్తుల ఆది రెడ్డి,కలుములు పోతురాజు,ఎం.సుగుణ దొరకె.కుమారి,కె.రామకృష్ణ దొర,పి.శశి కాంత్ రెడ్డి,వై.సీతమ్మ ,కె.గౌరమ్మ,కె.భవాని,ఎస్.ఇంద్ర రెడ్డి,పొడియం పండు దొర,కుంజం రాంబాబు దొర,కుర్సం ఫకీర్ దొర,గంటి మల్ల సత్యనారాయణ మొదలైన వారు పాల్గొన్నారు.
