
పయనించే సూర్యుడు గాంధారి 26/02/25 గాంధారి మండలం పేట్ సంగం గ్రామంలోని ప్రముఖ దేవాలయం శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం ఈ ఆలయ నూతన పూజారిగా మఠం కార్తిక్ స్వామిని నియమించారు, కార్తిక్ స్వామిని గ్రామస్తులందరు సన్మానం చేసి ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమం అనంతరం గ్రామస్తులందరు మాట్లాడుతూ రాబోయే మహాశివరాత్రి వేడుకలని ఘనంగా నిర్వహించడానికి సంబందిత కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.