Wednesday, September 10, 2025
Homeఆంధ్రప్రదేశ్సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూటమి సాధించిన పథకాలు:

సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూటమి సాధించిన పథకాలు:

Listen to this article


పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి.నరేష్ డివిజన్ ఇంచార్జి జూన్ 4

నెలలో మొదటి తేదీలోనే వృద్ధాప్య పెన్షన్ ఇంటి ఇంటి కి ఇవ్వటం.ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం మూడు వేలను నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంపు చేసి ప్రతి నెల ఇంటికి ఇవ్వడం జరిగింది.ఉచిత ఇసుక విధాన పాలసీని తీసుకురావడం జరిగింది. ఎంతో మంది కార్మికులకు ఉపాధి కల్పించడం జరిగింది.
నాణ్యమైన మద్యం డిజిటల్ పేమెంట్స్ సరళమైన ధరలతో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. స్థానిక సంస్థలకు పంచాయతీలు, ఎంపీటీసీలకు జడ్పిటిసిలకు నిధులు కేటాయించడం జరిగింది. వాహన ఓనర్లకు గ్రీన్ టాక్స్ రద్దు చేయడం జరిగింది.16 వేల టీచర్ పోస్టులు మొదటి సంవత్సరంలోని నింపడం జరుగుతుంది. జీవో 3.నెంబర్ స్థానంలో కొత్త జీవోను తీసుకురావడం కోసం టిఏసి కమిటీ ఏర్పాటు చేయటం ఆదివాసి సంఘాలతో మాట్లాడటం జరుగుతుంది.పోడు భూము పట్టాల కోసం దరఖాస్తులు స్వీకరణ త్వరలోనే పట్టాలు ఇవ్వడం జరుగుతుంది.రోడ్ల మరమ్మత్తుల కోసం నిధులను కేటాయించడం జరిగింది. పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది.పోలవరం నిర్వసితులకు గత ఐదు సంవత్సరంలో ఇవ్వనటువంటి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఒకేసారి 918 కోట్లు రిలీజ్ చేసి నిర్వసితుల ఖాతాలో జమ వేయడం జరిగింది. ప్రభుత్వాసుపత్రిలో నాణ్యమైన మెడికల్ విధానం తీసుకొచ్చి పేషంట్లకు అనేక రకాల మందులను అందుబాటులోకి తీసుకురావడం అందులో భాగంగా హార్ట్ ఎటాక్ సంబంధించి నలభై వేల రూపాయల ఖరీదైన ఇంజక్షన్ అందుబాటులో తీసుకురావడం జరిగింది.ఉపాధి హామీ నిధుల ద్వారా గ్రామాల్లో చెరువులు పశువుల కొట్టాల పశువులు మంచినీరు కోసం తొట్లు రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులకు నాణ్యమైన దుస్తులు పుస్తకాలు ఎటువంటి అడ్వటైజ్మెంట్స్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది అలానే
ఈ విద్యాసంవత్సరం నుండి ఎంబైపిసి అనే కొత్త గ్రూపును ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సంవత్సరం లో అమ్మినటువంటి ధాన్యం రైతులకు 24 గంటల్లోపే రైతుల ఖాతల్లో నగదు జమ చేయడం జరిగింది. వాట్స్ అప్ ద్వారా అన్నీ రకాల సేవలు అందుబాటులో లోకి తీసుకురావడం జరిగింది. జూన్ 12 తేదీ నుండి తల్లికి వదనం ద్వారా పిల్లల తల్లి బ్యాంకు ఖాతా ₹15000/- జమ చేయడం జరగుతుంది. జూన్ 12 నుంచి రైతు లకు 20 వేలు జమ బ్యాంక్ ఖాతా లో జమ చేయడం జరగుతుంది.పోలవరం నిర్వసితులకు ఇంటి విలువ, కాలనీలు తో పాటు ఆర్ అండ్ ఆర్ అతి త్వరలో జమ చేయడం జరగుతుంది.తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఇళ్ల చిన్నారెడ్డి బిజెపి మండల అధ్యక్షుడు దాసరి రమణారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి మల్లెల వెంకటేశ్వరావు క్లస్టర్ ఇంచార్జ్ ఓ. నరసింహారావు. గడ్డం సురేష్ కుమార్ చౌదరి ఆకోజు నూకాచారి పొదిలి రామారావు శీలం తమ్మయ్య వాస శ్రీరామ్ మూర్తి ముత్యాల శ్రీరామ్ తివారి మధుసూదన్ భూక్య మోహన్ జనసేన నాయకులు తీగల రవి కవిత కారం దుర్గారావు బెడే సతీష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments