
గ్రామ అధ్యక్షులతో కలసి ప్రారంభించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్.
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 04 షాద్ నగర్ ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్ )
కేశంపేట కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆహార భద్రత కార్డు కలిగిన పేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం వరంలాంటిదని మార్కెట్ కమిటీ డైరెక్టర్ త్రిప్పి శెట్టి కరుణాకర్ పేర్కొన్నారు. కేశం పేట మండల పరిధిలోని కొండారెడ్డి పల్లి గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు త్రిప్పిశెట్టి సుదర్శన్ తో కలిసి నిరుపేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,,,రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబంలోని సభ్యులకి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందని, గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడం వలన లబ్ధిదారులు ఎవరు తినేవారు కాదని అది గ్రహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై భారం పడినప్పటికీ సన్న బియ్యం పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.ఇంత మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,నియోజకవర్గం ఎమ్మెల్యే శంకర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏర్పుల లింగం ముదిరాజ్,వట్టెల లింగం యాదవ్,రేషన్ డీలర్ శ్రీనివాస్,గ్రామ సెక్రెటరీ స్వరూప్ కుమార్,సూరం శీను,పల్లె ఎంకయ్య, పల్లె బాలరాజ్,కేశమొని సత్తయ్య తదితరులు పాల్గొన్నారు…