Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే

సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతిరావు పూలే

Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

మహాత్మా జ్యోతిరావు పూలే అనుసరించిన మార్గం అందరికీ ఆచర ణీయమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. పూలే 198వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన త్యాగాలను సమాజానికి చేసిన సేవలను స్మరించుకు న్నారు. ఒక సామాన్యుడిగా మొదలై ఒక సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. సామాజిక కార్యకర్తగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావితరాలకు సైతం మార్గదర్శకుడని రేవంత్ రెడ్డి, ఈ సందర్భంగా గుర్తు చేశారు. సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియడారు.వెనుకబడిన వర్గాలు దళిత జనోద్ధర ణకు పూలే ఎంచుకున్న బాట, అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్సు ను కాంక్షించే వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంద న్నారు. మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభు త్వం అనేక వినూత్న ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేపట్టిందని రేవంత్ రెడ్డి తెలిపారు.ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిభా పూలే పేరు పెట్టి ప్రజా భవన్ గా మార్చడం జరిగిందని గుర్తు చేశారు.
పూలే స్పూర్తితోనే విద్య, ఉపాధి అవకాశాలు అన్ని వర్గాల వారికి అందించాలనే లక్ష్యంతోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టడం జరిగిందన్నారు. దేశంలోనే తొలి సారిగా బీసీ కుల గణన చేపట్టి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు ను అసెంబ్లీలో ఆమోదిం చడం జరిగిందన్నారు. అంతేగాకుండా మహిళల సాధికారతకు రాష్ట్ర ప్రభు త్వం సరికొత్త పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. మహిళా శక్తి పాలసీ ద్వారా డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు, వారి పేరిట పెట్రోల్ బంకుల ఏర్పాటు, సోలార్ పవర్ ప్లాంట్ల కేటాయింపు, ఆర్టీసీకి అద్దె బస్సులు ఇలా ప్రతి రంగంలో మహిళలను ప్రోత్సాహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తుందన్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు అయి దు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాలను ఇప్పటికే అమలు చేసిందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పట్టాలు కూడా మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతుంద న్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments