పయనించే సూర్యుడు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ (20: జనవరి) (ఆదోని నియోజకవర్గం)
హైదరాబాద్ : చిన్న వయసులోనే సాయి భారతి విద్యాసంస్థలను ఆదోని పట్టణంలో స్థాపించి అనేకమంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నటువంటి విద్యావేత్త కరస్పాండెంట్ బీసీ దుర్గేష్ కు హైదరాబాదులోని జి .ఎస్ .హెచ్. ఎస్. టి .ఎ. అకాడమీ అనుబంధ సంస్థలైన డే స్ప్రింగ్ తీయాలజికల్ యూనివర్సిటీ టెక్సస్ యూ.ఎస్.ఏ .మరియు గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ న్యూయార్క్, అమెరికా సంస్థల వారు, వీరు చేస్తున్న విద్యారంగానికి, కృషికి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ తో 6.01.2025 హైదరాబాదులో జరిగిన ప్రత్యేక కాన్వకేషన్ కార్యక్రమంలో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డే స్ప్రింగ్ తీయాలజికల్ యూనివర్సిటీ టెక్సాస్ యూ.ఎస్.ఏ .మరియు గుడ్ న్యూస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ న్యూయార్క్, అమెరికా ప్రతినిధులు మరియు అకాడమీ చైర్మన్ అండ్ డైరెక్టర్ , ఛాన్స్ లర్, వైస్-ఛాన్స్ లర్ తదితరులు పాల్గొన్నారు