
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 4 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూరు మండలంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ ఆదేశానుసారంగా ఎండలు జాగ్రత్త అను కరపత్రాలను సాలుర మండల ఎమ్మార్వో వై. శశిభూషణ్ మరియు సాలూర మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజకుమార్ ఆవిష్కరించారు అనంతరం డాక్టర్ రాజకుమార్ మాట్లాడుతూ ఎండ దెబ్బ తగలకుండా చల్లటి కొబ్బరి నీళ్లు మజ్జిగ అంబలి లాంటివి తీసుకోవాలని మరియు ఎండ తీవ్రత వలన వాంతులు విరచనలు అయినచో సమీపంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు లభించే ఓఆర్ఎస్ ద్రావణంను తీసుకోవాలి మరియు పారసీటమాల్ టాబ్లెట్ను తగిన మోతాదులో వాడాలని ఎండలో తిరిగి వచ్చిన తర్వాత వెంటనే నీళ్లు త్రాగరాదని కొంత విరమణ తర్వాత త్రాగాలి అని మరియు వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థత గురికావడం ముఖ్యంగా వృద్ధులు షుగర్ బీపీ గుండె జబ్బులు ఉన్నవారు సమీపంలో ఉన్న డాక్టర్ను సంప్రదించాలని మరియు ఎండ దెబ్బ తగిలిన వెంటనే చల్లని ప్రదేశానికి చిన్నారులను వృద్ధులను తరలించి తడి గుడ్డతో శరీరాన్ని తడపాలి అని డాక్టర్ రాజకుమార్ పేర్కొన్నారు. ఆర్ ఐ ఆనంద్ నజీర్ కన్నె భీంరావు పాల్గొన్నారు