
పయనించే సూర్యుడు మార్చి 10 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
భారత దేశం లో తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్బంగా ఆ మహనీయురాలుకి కూకట్ పల్లి మూసాపేట్ లోని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ వర్కింగ్ చైర్మన్ తూము వినయ్ కుమార్ ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు, ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం, బీసీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు తెల్ల హరికృష్ణ, సంతోష్ అవినాష్ టింకు పైల్వాన్ శ్రీకాంత్ లక్ష్మీ నారాయణ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ నేతలు మాట్లాడుతూ సమాజంలో అసమానతల మీద అలుపెరుగని పోరాటం చేసి అనగారిన వర్గాల్లో విద్యావ్యాప్తి కోసం చేసిన గొప్ప సంఘ సంస్కర్త అని ప్రతి ఒక్కరూ వారి ఆశయ సాధనకు పునరఅంకితం కావాలని ఆకాంక్షిస్తూ భారతదేశపు తొలి మహిళ ఉపాధ్యాయురాలు స్త్రీ సాధికారత కోసం విశేషంగా కృషి చేసిన సావిత్రి బాయి పూలే గారి అని కొనియాడారు.