
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్ ది. 07.04.2025
పేగ పంచాయితి నుండి చింతూరు ఐటీడీఏ వరకు 35 కీమి పాదయాత్ర చెయ్యడంతో అధికారులు స్పందించి ముంపు మండలాల్లో ఉన్న ఎత్తి పోతల పథకాల మరమ్మత్తుల విషయం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీల దినోత్సవం రోజుఎత్తిపోతల పథకాల మరమ్మత్తులకు 2 కోట్లు కేటాయిస్తున్నాం అని కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని పేగ పంచాయితి యూత్ ప్రెసిడెంట్ సోడే శ్రీను అన్నారు గిరిజన ప్రాంతాలు వర్షాధార వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాయి ఆ తరుణంలో వర్షాకాలం లో కూడా సమయానికి వర్షాలు కురవకపోవడంతో గిరిజనులు పెట్టిన పంటలు ఎండిపోయి నష్టపోతున్నరన్నారు. గిరిజనులు అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం ఒక్కటే మార్గమని వ్యవసాయ ఆధారంగానే గిరిజనులు అభివృద్ధి చెందే అవకాశం ఉందనీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయంలో చింతూరు , కూనవరం ,VR పురం మండలాలకు ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసారు చేసిన కొన్ని సంవత్సరాలకే సరైన పర్యవేక్షణ లేకుండా మరమ్మత్తులకు గురి అవ్వడంతో పూర్తిగా పాడయ్యాయి. ముంపు లేని ప్రాంతాల్లో ఉన్న ఎత్తి పోతల పథకాల మరమ్మత్తులకు 2 కోట్లు కేటాయిస్తాం అని ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఆశా చూపి నోరు మెదపకుండా ఉండడంతో ప్రజలకు కూటమి ప్రభుత్వం పట్ల ఆశలు సన్నగిల్లుతున్నాయి ఇప్పటికి అయిన ప్రభుత్వం స్పందించి ఎత్తిపోతల పథకాలు మరమ్మత్తులకు బడ్జెట్ రిలీజ్ చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.