
ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టండి
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య
పయనించే సూర్యుడు ఆగష్టు 20 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు:అల్పపీదన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇల్లందు మున్సిపాలిటీ కార్యాలయం సమావేశ మందిరంలో మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, వార్డు సభ్యులు సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ. ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. అంతేకాకుండా వార్డులలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. బుగ్గ వాగు వరద ముంపు ప్రాంతాలలో ఎలాంటి నష్టం జరగకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వార్డులలో రాత్రి వేళలో ప్రతి వీధిలో వీధిలైట్లు వెలిగే విధంగా చేపట్టాలన్నారు.ఈకార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.