Tuesday, July 15, 2025
Homeఆంధ్రప్రదేశ్సుపరిపాలనలో తొలి అడుగు సాయినగర్ లో ఇంటింటికి ఎమ్మెల్యే

సుపరిపాలనలో తొలి అడుగు సాయినగర్ లో ఇంటింటికి ఎమ్మెల్యే

Listen to this article

పయనించే సూర్యుడు జూలై 14 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :

కూటమి ప్రభుత్వం ఏడాది పాటు రాష్ట్రం లో చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను గురించి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేయడం కోసం వాడ వాడల నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. ఈ కార్యక్రమం లో భాగంగా సూళ్లూరుపేట పట్టణం లోని సాయినగర్లో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందించి వారికి ప్రభుత్వ పథకాలు అందాయా లేదా అడిగి తెలుకున్నారు. అలాగే ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అందిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధక్షులు ఆకుతోట రమేష్ అద్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమం లో వాడ వాడల ఎమ్మెల్యే కు మహిళలు పూలమాలలు వేసి హారతులిచ్చి ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు . పెద్ద సంఖ్యలో మహిళలు,టీడీపీ నేతలు ఎమ్మెల్యే వెంట నడిచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి నిండుదనం తీసుకువచ్చారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షలు పచ్చవ మాధవ నాయుడు, ముప్పాళ్ల శ్రీహరి రెడ్డి, టీడీపీ నేతలు పోలూరు శ్రీనివాసులు,EV సురేష్, సాయినగర్ బూత్ ఇంచార్జి పట్టుపల్లి రాజశేఖర్, శరవణ, గిరిరాయల్, జోగేశ్వర్ రావు, సుధాకర్ బూత్ కన్వీనర్లు , కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments