
పి హెచ్ సి నెల్లిపాక సిబంది నిరసన ప్రదర్శనకు
చింతూరు డిప్యూటీ డి ఎం & హెచ్ ఓ కి వినతి
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 6
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో మంగళవారం, పి హెచ్ సి నెల్లిపాక, గత వారం రోజులుగా వారి డిమాండ్లు సాధించుకోడానికి నిరసన చేస్తున్న ఎన్ హెచ్ ఎం సిబ్బంది ఐన ఎం ఎల్ హెచ్ పి @ సి హెచ్ ఒ లు వారి కష్ట నష్టాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి డిమాండ్లు సాధించు కోవలసింది పోయి మొత్తం వైద్య ఆరోగ్య శాఖ విధానాన్ని, వైద్యులను, పారామెడికల్ సిబ్బందిని, ముక్యంగా సూపర్వైజర్స్ని, ఎ ఎన్ ఎం లను అవమానిస్తూ, కించపరుస్తూ మాట్లాడడం, సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడాన్ని తీవ్రంగా కండిస్తూ… వెంటనే సంబంధిత వ్యక్తులు, అసోసియేషన్ బాద్యులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నెల్లిపాక పి హెచ్ సి సిబ్బంది నిరసన ప్రదర్శనకు చేశారు.ఈ సందర్బంగా ఆల్ ఇండియా ఆదివాసి ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు, ఎ పి మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ గుజ్జా సీతమ్మ మాట్లాడుతూ… గుర్తింపు గౌరవం అనేవి ఉన్నత చదువులు చదివినంత మాత్రాన ఇచ్చేవి కాదని, అంకితభావంతో ఇన్నాళ్లు మేము సమాజానికి చేసిన సర్వీస్, సత్ప్రవర్తనతో ఈ స్థాయికి చేరుకున్నామని, ఈ చిన్న లాజిక్ తెలుసుకోడానికి ఉన్నత చదువులు అవసరం లేదని కొద్దిపాటి కామన్ సెన్స్ ఉంటే సరిపోద్దని కానీ ఉన్నత చదువులు చదివామనే అహంకారంతో మీడిసిపడుతూ నోటికోచ్చినట్టు వాగితే సహించేది లేదని హేచ్చరిస్తూ తక్షణమే అసోసియేషన్ బాద్యులు, సంబంధిత వ్యక్తులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం చింతూరు డిప్యూటీ డి ఎం & హెచ్ ఓ డా. పుల్లయ్య కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డా. గౌతమి, డా. నాగమణి, పి హెచ్ ఎన్ అరుంధతి, ఫార్మాసిస్ట్, ఎల్ టి లు, ఏ ఎన్ ఎం లు, హెల్త్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.