
కల్పించిన టిడిపి మండల కన్వీనర్.
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 3 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బూత్ ఇంచార్జ్ లు, యూనిట్, క్లస్టర్ ఇంచార్జ్ లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కేఎస్ఎస్ సభ్యులు, తమ వంతు బాధ్యతగా ప్రతి ఇంటిని సందర్శించి “డోర్ టు డోర్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిడిపి మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు గురువారం జరిగిన కార్యక్రమంలో తెలిపారు. ఈ సందర్భంగా కన్వీనర్ నాయుడు మాట్లాడుతూ బూత్ కన్వీనర్లు సందర్శించిన ఇళ్లను నమోదు చేయడానికి తెలుగుదేశం పార్టీ తరపున “మై టీడీపీ” అనే యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని ఈ యాప్ ను ఉపయోగించే విధానాలను వివరంగా పొందుపరిచామన్నారు. ప్రచారంలో భాగంగా బూత్ ఇన్ ఛార్జ్ లు, యూనిట్, క్లస్టర్ ఇంచార్జ్ లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కేఎస్ఎస్ సభ్యులు, ఇంటింటినీ సందర్శించాలి సందర్శించిన ఇంటి సభ్యులకు పొంప్లెట్ అందజేసి, గత ఏడాది కూటమి ప్రభుత్వ విజయాలను వివరించండి యాప్ లో మొదట మొబైల్ నంబర్ లేదా మెంబర్షిప్ ఐడీ ఎంటర్ చేయండి. తర్వాత వచ్చే ఓటిపి ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. డోర్ టు డోర్ క్యాంపెయిన్” మై టీడీపీ యాప్ లో నమోదు చేయు విధానం లాగిన్ అయిన తరువాత స్క్రీన్ పై కనబడే అవర్ సెక్షన్ లో యాక్టివిటీస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. తరువాత డోర్ టు డోర్ క్యాంపెయిన్” పై క్లిక్ చేయండి. తరువాత స్క్రీన్ పై కనబడే “సుపరిపాలనలో తొలి అడుగు” పై క్లిక్ చేయండి. స్క్రీన్ పై బూత్ యొక్క ఇండ్ల లిస్టు మీకు కనబడుతుంది. సందర్శించిన ఇంటిని లిస్టులో వెతికి వారి పేరు ముందు విజిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. విజిట్ చేసిన ఇంటి సభ్యులతో క్యాప్చర్ ఫోటో ఆప్షన్ పై క్లిక్ చేసి ఫొటో తీసుకొని, వెరిఫై ఆప్షన్ పై క్లిక్ చేసి యాప్ లో వివరాలను నమోదు చేయవచ్చు. ఆ తరువాత యాప్ లో మూడు రకాల ప్రశ్నలు రావటం జరుగుతుంది. ఇంటి సభ్యుడిని అడిగి దానికి సమాధానాన్ని యాప్ లో అప్డేట్ చేయండి. అందులో మొదటిగా కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకొని నమోదు చేయాలని కన్వీనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు బొట్టు శేఖర్, మధు రాజు, తాండ్ర విక్రమ్, ఆదినారాయణ, నాగేంద్ర, మహమ్మద్, హాజీ మస్తాన్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు