
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 22 సూర్యాపేట జిల్లా ప్రతినిధి:
మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి చేతుల మీదగా ఈరోజు ఉదయం గండూరి షాపింగ్ మాల్ ను ప్రారంభించారు..
సూర్యాపేట జిల్లా వాసుల షాపింగ్ అవసరాలను తీర్చడానికి నూతనంగా ఒక షాపింగ్ మాల్ అందుబాటులోకి వచ్చింది.స్థానిక ట్రెండ్స్ సమీపంలో గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో నిర్మించిన గండూరి షాపింగ్ మాల్ ను మాజీ మంత్రి,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభించారు.ఈ ప్రారంభోత్సవానికి పలువురు ప్రముఖులు,స్థానిక వ్యాపారవేత్తలు స్థానిక ప్రజలు హాజరయ్యారు.గండూరి షాపింగ్ మాల్ లో బ్రాండెడ్ వస్త్రాల నుంచి అన్ని ఒకే చోట భిస్తాయి.ముఖ్యంగా మహిళలకు పిల్లలకు,పురుషులకు సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ కు అనుగుణంగా వస్త్రాల సేకరణను ఇక్కడ అందుబాటులో ఉంచారు.ఆధునిక డిజైన్లతో, సువిశాలమైన అంతర్భాగంతో ప్రారంభించిన ఈ షాపింగ్ మాల్ ను కస్టమర్లకు,ఆహ్లదకారమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది.స్థానిక నూతన వ్యాపార కేంద్రాల ఏర్పాటు వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని,పట్టణ ఆర్థిక వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు సూర్యాపేట ప్రజలకు అత్యుత్తమ షాపింగ్ సేవలు అందించడమే తమ లక్ష్యమని గండూరి షాపింగ్ మాల్ నిర్వాహకులు కృపాకర్ తెలిపారు.గండూరి షాపింగ్ మాల్ ప్రారంభంతో సూర్యాపేట ప్రజలకు షాపింగ్ చేయడానికి మరో కొత్త వేదిక లభించినట్లయింది.ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్తలు స్థానిక ప్రజలు ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
