
ఎంకన్నగూడ తాండా సేవాలాల్ గుడికి బీజేపీ నేత అందే బాబన్న నుండి రూ.25,000 విరాళం
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని ఎంకన్నగూడ తాండాలో గల శ్రీ సేవాలాల్ మహారాజ్ గుడి అభివృద్ధి నిమిత్తం బీజేపీ షాద్‌నగర్ నియోజకవర్గ ఇంచార్జ్ అందే బాబన్న గారు రూ.25,000 రూ విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, గిరిజన పెద్దలు, గుడి కమిటీ సభ్యులు ఆయనకు ఘనసన్మానం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గిరిజన పెద్దలు మాట్లాడుతూ, “గిరిజనుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే సేవాలాల్ మహారాజ్ గుడి అభివృద్ధి కోసం ఎవరైనా ముందుకు రావడం ఎంతో హర్షకరం. బాబన్న దాతృత్వం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా అందే బాబన్న మాట్లాడుతూ –“గిరిజన సమాజం మన దేశపు మూలస్తంభం. వారి సంస్కృతి, సంప్రదాయాలు అపారమైన గౌరవానికి పాత్రులు. సేవాలాల్ మహారాజ్ గారి ఆశీస్సులతో గిరిజనుల సంక్షేమం, ఆధ్యాత్మిక అభివృద్ధికి బీజేపీ ఎల్లప్పుడూ అంకితమై ఉంటుంది. ఈ గుడి అభివృద్ధి కోసం నా వంతు సహాయాన్ని కొనసాగిస్తాను” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు వంశీకృష్ణ,ప్రశాంత్ ముదిరాజ్ మరియు గ్రామ పెద్దలు, యువత, పాల్గొన్నారు