Tuesday, September 23, 2025
Homeఆంధ్రప్రదేశ్సైబర్ నేరాల పై అవగాహన కల్పించే చిత్రపటాల ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ.

సైబర్ నేరాల పై అవగాహన కల్పించే చిత్రపటాల ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ.

Listen to this article


సైబర్ నేరాల పై అవగాహన కల్పించే పోస్టర్ లు ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

డిజిటల్ అరెస్ట్ (ఆన్లైన్ వీడియో కాల్ లో అరెస్ట్) అనేది లేదు

డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్టు వీడియో కాల్ వస్తే స్పందించవద్దు

జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్

పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 23 :- రిపోర్టర్( కే శివకృష్ణ )

డిజిటల్ అరెస్ట్ (ఆన్లైన్ వీడియో కాల్ లో అరెస్ట్)  అనేది లేదని, డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు చేసే వీడియో కాల్స్ కు స్పందించవద్దని ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ ప్రజలకు తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ సైబర్ నేరాల పై ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రచార పోస్టర్లు, కరపత్రాలను సోమవారం జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, సైబర్ నేరాలు కూడా అంతే వేగంతో పెరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగి, ఇంటర్నెట్ ప్రతి ఇంట్లోకి ప్రవేశించడంతో సైబర్ నేరగాళ్లు ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఆ మోసాలకు బలికాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.ఇటీవల చీరాలలో ఒక విశ్రాంతి ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ పేరుతో భయభ్రాంతులకు గురిచేసి అతని వద్ద నుండి సుమారు కోటి పదిలక్షల నగదును సైబర్ నేరగాళ్లు దోచుకున్నారన్నారు. విద్యావంతులు సైతం సైబర్ నేరాల బారిన పడుతుండడం మనం చూస్తున్నామన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకువచ్చేందుకు  ఈ  ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.డిజిటల్ అరెస్ట్, పీఎం కిసాన్ యాప్ ఏపీకే ఫైల్స్ మోసాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, నకిలీ లోన్ యాప్స్, పార్ట్ టైం జాబ్స్, నకిలీ వెబ్సైట్లు, బ్యాంకింగ్, ఈ కామర్స్, సోషల్ మీడియా వంటి పలు రకాల మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతూ బాధితుల వద్ద నుంచి నగదు కొల్లగొడుతున్నారన్నారు.ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న కొన్ని ముఖ్యమైన సైబర్ నేరాలు:డిజిటల్ అరెస్ట్:పోలీసులు, సీబీఐ, ఈడీ, టెలికాం శాఖ, కస్టమ్స్ లేదా ఇంటర్‌నేషనల్ కొరియర్ సంస్థల పేరుతో వాట్సాప్ వీడియో కాల్ చేస్తారు. “మీరు విచారణలో ఉన్నారు” అని చెప్పి, వీడియో ఆఫ్ చేయకుండా నిర్బంధిస్తారు. ఆ సమయంలో మీ బ్యాంక్ ఖాతాలు, వ్యక్తిగత వివరాలు అడిగి, డబ్బులు బలవంతంగా బదిలీ చేయిస్తారు. ఈ మోసాలకు ఉన్నత విద్యావంతులు సైతం బలయ్యారు.గతంలో చుండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వేటపాలెం గ్రామంలో నివాసముండే విశ్రాంతి ఉద్యోగిని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు భయబ్రాంతులకు గురిచేసి అతడి నుండి సుమారు 74 లక్షల రూపాయల నగదును సైబర్ నేరగాళ్ల ఖాతాలకు బదిలీ చేయించుకున్నారు. ఆ కేసును బాపట్ల జిల్లా పోలీసులు విజయవంతంగా చేదించి ఇతర రాష్ట్రాలలో ఉన్న ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగింది.భారత చట్టాల్లో “డిజిటల్ అరెస్ట్” (ఆన్లైన్ లో అరెస్ట్)  అనే పదం లేదు.మీ వ్యక్తిగత లేదా బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పవద్దు.ఎంత భయపెట్టినా డబ్బు బదిలీ చేయకండి.ఇలాంటి కాల్ వచ్చిన వెంటనే కాల్ డిస్కనెక్ట్ చేయండి.వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయండి.గోల్డెన్ అవర్ లో రిపోర్ట్ ఫిర్యాదు చెయ్యాలి. పీఎం కిసాన్ (PM-KISAN) యాప్ APK ఫైళ్ల పేరుతో సైబర్ మోసాలు:రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే స్కీమ్ అమలు చేస్తుంది. దీని ద్వారా అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ.6,000 నగదు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరగాళ్లు నకిలీ APK ఫైళ్ల రూపంలో మోసాలకు పాల్పడుతున్నారు. “PM-KISAN డబ్బు పొందేందుకు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి” అనే పేరుతో లింక్ పంపుతారు. ఈ లింక్‌ను ఓపెన్ చేస్తే APK ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ చేసిన యాప్‌ను ఓపెన్ చేయగానే, అది మీ ఫోన్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ చేస్తుంది.APK ఫైళ్లను అనుబంధం లేని వెబ్‌సైట్ల నుండి డౌన్‌లోడ్ చేయవద్దు.PM-KISAN అధికారిక వెబ్‌సైట్: [https://pmkisan.gov.in] ను మాత్రమే ఉపయోగించండి. ఇన్వెస్ట్మెంట్ మోసాలు:ఈ రోజుల్లో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు పొందాలనే ఆశతో చాలా మంది ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తున్నారు. దీనికి ప్రధానంగా స్టాక్ మార్కెట్ లో అధిక లాభాలు కోసం అనధికార వెబ్సైట్లు మరియు యాప్స్ లలో పెట్టుబడులు పెడుతున్నారు. దీనిని సైబర్ నేరగాళ్లు అవకాశంగా తీసుకుని, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే మరింత ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశ చూపుతూ, రకరకాల కారణాలు చూపించి వేల, లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిస్తారు. డబ్బులు గెలిచినట్లుగా వాళ్ల ఫేక్ వెబ్‌సైట్‌లో చూపిస్తారు. కానీ అవి నిజమైన డబ్బులు కావు. ఆ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో జమకావు. దానికి వారు వివిధ కారణాలు చూపించి, మీకు ఆశ కల్పించి మరింత డబ్బును తమ ఖాతాలో జమ చేయించుకుంటారు.తీరా బాధితులు మోసపోయామని గుర్తించే సరికి, జరగవలసిన నష్టం జరిగిపోతుంది.అధికారిక గుర్తింపు లేని కంపెనీల్లో పెట్టుబడి పెట్టవద్దుఅధిక లాభాలు వాగ్దానం చేస్తున్న స్కీములపై నమ్మకంతో ముందుకు వెళ్లవద్దు.SEBI (భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ)లో రిజిస్ట్రేషన్ ఉందా అని చెక్ చేయండి.సోషల్ మీడియా వేదికలపై వచ్చే ‘ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్లు’ను నమ్మవద్దు.నకిలీ లోన్ యాప్‌లు (Fake Loan Apps): అనేక నకిలీ లోన్ యాప్‌లు సోషల్ మీడియా, మెసేజ్ లింకుల ద్వారా లభ్యమవుతున్నాయి. వీటిలో రిజిస్టర్ అయ్యే క్షణం నుండి వ్యక్తిగత వివరాలు, కాంటాక్టులు, ఫోటోలు, గ్యాలరీ డేటా మొత్తం మోసగాళ్లకు చేరిపోతాయి. తొలుత చిన్న మొత్తంలో లోన్ మంజూరు చేస్తారు. కానీ చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే అధిక వడ్డీలు విధించి, అవమానకరమైన ఫోటోలు, వీడియోలు సృష్టించి బంధువులు, స్నేహితులకు పంపిస్తామని బెదిరిస్తారు.ఆకర్షణీయమైన ఆఫర్లు సులభమైన లోన్లు వెనుక సైబర్ మోసగాళ్ల వల దాగి ఉంటుంది అప్రమత్తంగా ఉండాలి.గుర్తింపు పొందిన బ్యాంకులు, NBFC (non banking financial companies) లు ఆమోదించిన యాప్ ల ద్వారానే లోన్లు తీసుకోవాలి.RBI (Reserve Bank of India) వెబ్‌సైట్‌లో ఆమోదిత ఫైనాన్షియల్ సంస్థల జాబితా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది.ఏపీకి ఫైల్స్ ద్వారా లోన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోరాదు.యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కాంటాక్ట్ పర్మిషన్స్  ఫొటోస్ వీడియోస్ పర్మిషన్స్ కానీ ఇవ్వకూడదు. ఫేక్ వెబ్‌సైట్లు:ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు, సేవల పేరిట నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి ప్రజల నుంచి నగదు దోచుకుంటున్నారు. అసలైన సంస్థలను పోలిన నకిలీ వెబ్‌సైట్లు సైబర్ కేటుగాళ్లు నేరాలకు ఉపయోగిస్తున్నారు.బాపట్ల జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సూర్యలంకలోని హరిత రిసార్ట్స్ వెబ్సైట్  పేరును పోలిన నకిలీ వెబ్సైట్ ను సైబర్ నేరగాళ్లు రూపొందించి దాని ద్వారా యాత్రికుల నగదును దోచుకున్నారు. వారు ఇదే రకంగా ప్రముఖ పర్యాటక కేంద్రాలు, దేవస్థానాల వెబ్సైట్లను పోలిన నకిలీ వెబ్సైట్లను సృష్టించి నేరాలకు పాల్పడినారు. ఇటీవల రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ముద్దాయిలను నకిలీ వెబ్సెట్ల కేసులో అరెస్ట్ చేయడం జరిగింది.ఎప్పుడూ URL చెక్ చేయండి. https ఉన్నవెబ్సైట్ లను మాత్రమే ఓపెన్ చేయండి ఫేక్ వెబ్సైట్ లో ఒక ఫార్మ్ పెట్టి డేటా అనగా మన పేరు మొబైల్ నెంబర్ తదితర వివరాలు తీసుకోని వాట్స్ అప్ లో చాట్ చేస్తారు, అసలైన వెబ్సైట్ లో స్లాట్ బుకింగ్ ఆప్షన్ ఉంటుంది పేమెంట్ వెబ్సైట్ లోనే చేస్తారు ఈ తేడా ను గమనించుకోవాలి.అనుమానం ఉంటే, గూగుల్‌లో ఆ వెబ్‌సైట్ గురించి రివ్యూలు చూడండి.బ్యాంకింగ్ మోసాలు:మీ ఖాతా బ్లాక్ అయింది”, “KYC పూర్తిచేయండి” వంటి సందేశాలు పంపించి, డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలు, ఓటీపీ తీసుకొని ఖాతాలోని డబ్బును మాయం చేస్తారు.బ్యాంకులు ఎప్పుడూ OTP లేదా పాస్‌వర్డ్ అడగవు — ఎవరికీ ఇవి చెప్పవద్దు.అధికారిక బ్యాంక్ యాప్ లేదా వెబ్‌సైట్‌ ద్వారానే లాగిన్ అవ్వండి.లింక్ క్లిక్ చేసేముందు URL‌ను జాగ్రత్తగా పరిశీలించండి.అకౌంట్‌ నుంచి డబ్బు పోయిందని అనుమానం వస్తే వెంటనే బ్యాంక్‌కు సమాచారం ఇవ్వండి. సోషల్ మీడియా మోసాలు:ఫేస్‌బుక్, ఇన్‌…

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Most Popular

    Recent Comments