
పయనించే సూర్యుడు అక్టోబర్ 8 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
దొరవారి సత్రం మండలం శ్రీధనమల్లిలో నెలకొంటున్న సమస్యలపై ( కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం) పోరాటానికి శ్రీధనమల్లి స్మశానానికి దారి లేక గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు, స్థానిక గిరిజన కాలనీకి, SC కాలనీకి స్మశాన ఏర్పాటు విషయమై కెవిపిఎస్ (కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం) సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తుంది దీనికి స్పందించిన దొరవారి సత్రం ఎమ్మార్వో గారు వారి రెవెన్యూ సిబ్బందితో ఈరోజు శ్రీధనమల్లి గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా వారి దృష్టికి శ్రీధనమల్లి గ్రామంలో నెలకొన్నటువంటి సమస్యల్ని కెవిపిఎస్ తిరుపతి జిల్లా కార్యదర్శి డమాయి ప్రభాకర్ గారు, ఏపీ డీకేఎస్ రాష్ట్ర నాయకులు కె.వి మునెయ్య గారు తెలియజేశారు తాసిల్దారు గారు సానుకూలంగా స్పందించారు
