
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మాముడూరు గ్రామ సచివాలయం స్థానిక గ్రామంలో ప్రత్యేకంగా మహిళల ఆరోగ్యం గురించి బీపీ, షుగరు, క్యాన్సర్, రక్తహీనత, టిబి, లెప్రసీ, వంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఆరోగ్య సేవలపై గ్రామ ప్రజలకు తెలియపరచి అవగాహన కల్పించడం జరిగింది అని నాయకులు పేర్కొన్నారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్. టి. సుధీర్.సి. హెచ్.ఓ యం. వెంగయ్య . హెచ్. వి. ఎం పి హెచ్ ఏ . ఎం ఎల్ హెచ్పి లు, హెల్త్ అసిస్టెంట్ మస్తానయ్య .ఆశా వర్కర్లు బిజెపి నాయకులు బాలయ్య నాయుడు. బత్తల కిష్టయ్య. గుండాల భాస్కర్ రెడ్డి. పాల్గొన్నారు.