
బిక్షలో పాల్గొన్న హనుమాన్ స్వాములు…
రుద్రూర్ : రుద్రూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప సన్నిధానంలో హనుమాన్ స్వాములకు బిక్ష ఏర్పాటు చేశారు. అయ్యప్ప స్వామి జన్మదినాన్ని పురస్కరించుకొని, అయ్యప్ప సన్నిధానం కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అయ్యప్ప సన్నిధానంలో హనుమాన్ స్వాములకు బిక్ష ఏర్పాటు చేశారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హనుమాన్ స్వాములకు బిక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సన్నిధానం కమిటీ నిర్వాహకులు ప్రతిప్ సెట్, శ్యామ్, పత్తి రాము, వడ్ల గంగాధర్, పత్తి నవీన్, హనుమాన్ మాలధారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు.