
//పయనించే సూర్యుడు// జులై 24//మక్తల్
ధియేటర్ల దగ్గర సినిమా హడావిడి అనుకుంటే.. ఏకంగా పవన్ నామస్మరణ జాతరే జరిగింది..
అదే.. ‘హరి హర వీరమల్లు’.
యోధుడిగా.. సనాతనధర్మ పరిరక్షకుడిగా తనదైన స్టయిల్ స్వాగ్ తో ‘పవర్ స్టార్ పవన్ కల్యాణ్’ నట విశ్వరూపానికి తెర రూపం ‘హరి హర వీరమల్లు’.
పవన్ కళ్యాణ్ అద్భుత నటనకు ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రేక్షకులు తరుపున శిరస్సువంచి నమస్కరిస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా గురువారం ఈ చిత్రం విడుదల కావడంతో మక్తల్ వెంకటరమణ థియేటర్ వద్ద సందడి నెలకొంది. మక్తల్ జనసేన నాయకులు డాక్టర్ మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థియేటర్ దగ్గర ధూమ్ ధామ్ డ్యాన్స్లతో హోరెత్తిస్తూ తమ అభిమానాన్ని . చాటుకున్నారు. సినిమా ఘన విజయం సాధించినందుకు . కర్ని గ్రామం లో స్వయంభూ గుంటిరంగా స్వామి రూపం లో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వంచిన డాక్టర్ మణికంఠ గౌడ్ మరియు జనసేన సైనికులు మెగా ఫ్యాన్స్ పాల్గొన్నారు

