
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
గాంధీ భవన్ లో ఆర్మూర్ నియోజక వర్గ కాంగ్రెస్ నాయకుల సమావేశం.. పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి తదితరులు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్.. ఆర్మూర్ నియోజక వర్గంలో స్థానిక సంస్థల అన్ని సీట్లు గెలవాలి… గాంధీ భవన్ లో ఆర్మూర్ నియోజక వర్గ నాయకుల సమావేశంలో మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షులు.. కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా కష్టపడి పని చేసి సర్పంచ్, ఎంపిటిసి, జడ్పీటీసీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ లు అన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా పకడ్బందీగా ప్రణాళికతో ముందుకు పోవాలి ఆర్మూర్ నియోజక వర్గాన్ని నా స్వంత నియోజక వర్గంగా చూసుకుంటా. కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి సమస్యలు వచ్చినా కలిసికట్టుగా పని చేసుకొని పరిష్కరించుకుందాం. సమస్యలు ఉంటే ఇంచార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళితే నేనే,వినయ్ వెంట ఉండి పని చేసి పెడతాం.. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ పట్టణ,మండల మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
