
పయనించే సూర్యుడు మే 10 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
కిశోర వికాస్ వేసవి శిక్షణా కార్యక్రమం శిబిరాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సమగ్ర శిశు సంక్షేమ శాఖ ఆత్మకూరు సిడిపీఓ సునీలత శుక్రవారం పాడేరు. చేజర్ల. మాముడూరు. యనమదాల గ్రామ సచివాలయం పరిధిలోని గొల్లపల్లి .వన్. టు . తిమ్మాయిపాలెం. ఉలవపల్లి. చేజర్ల . యనమదాల అంగనవాడీ కేంద్రంలో కిషోరి వికాస్ వేసవి కాలం శిక్షణ కార్యక్రమం బాలికలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సూపర్వైజర్ సురేఖ మాట్లాడుతూ 11 నుండి 14సంవత్సరాలు, 15 నుండి 18 సంవత్సరాల బాలికలను గ్రూపులుగా విభజించి వారానికి రెండు రోజులు బాల్యవివాహాలు, ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాలికల పరిరక్షణకు అందుబాటులో వున్న చట్టాల గురించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు. పి .పద్మ. బి విజయ్ కుమారి. తిరుపతమ్మ. షాహినా భాను. ఏఎన్ఎం సుజాత. నిర్మల . జమీల. వేణు మాధవి. జ్యోతి. దేవి. భాగ్యమ్మ. కిషోర్ బాలికలు తల్లులు తదితరులు పాల్గొన్నారు
