
పయనించే సూర్యుడు ఆగస్టు 6 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలంలోని చేజర్ల అంగన్వాడి కేంద్రం నందు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించబడినది ఈ కార్యక్రమమునకు తల్లులందరినీ హాజరు పరిచి తల్లిపాల ప్రాముఖ్యతను గురించి తెలియజేశాను బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు తప్పక బిడ్డకు త్రాగించవలెనని తెలియజేస్తూ ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వవలెనని ఆరు నెలల నిండిన తర్వాత అనుబంధ ఆహారం మొదలు పెట్టే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తల్లులందరకు తెలియజేయడమైనది తల్లిదగ్గర బిడ్డకు సరిపోయినన్ని పాలు ఉండాలంటే తల్లి పోషకాహారం తప్పనిసరిగా తెలియజేసి . బిడ్డకు పాలు ఇచ్చే విధానాన్ని తెలియజేస్తూ డబ్బా పాలు పట్టడం వలన వచ్చే నష్టాన్ని తల్లిపాలు త్రాగించడం వలన వచ్చే లాభాన్ని తెలియపరచడం జరిగినది ప్రతి తల్లి బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు పరిశుభ్రంగా ఉండి పాలు బిడ్డకు ఇవ్వవలెనని తెలియజేయడమైనది ఈ కార్యక్రమమునందు చేజర్ల హాస్పిటల్ డాక్టర్ . షేక్ మెహతాబ్ ఎం ఎల్ హెచ్ పి. పి .దివ్య ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు సూపర్వైజర్ పద్మ పాల్గొన్నారు
