
పయనించే సూర్యుడు augost tug 5 (పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందు:పరదేశి బస్తి నె 1 అంగన్వాడి సెంటర్ లో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ రోహిణి మాట్లాడుతూ ముర్రు పాలు… తల్లి బిడ్డలకు శ్రీరామరక్ష’ అని వైద్యులు చెబుతున్నారు. శిశువుకు జన్మనిచ్చిన వెంటనే లభించే ఈ తొలి పాలను ప్రకృతి ప్రసాదించిన మొదటి టీకా గా అభివర్ణిస్తారు. ముర్రుపాలలో పోషక యాంటీ బాడీ లు పుష్కలంగా ఉంటాయి. అని ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాదిని వేస్తాయి, బిడ్డ పుట్టిన వెంటనే ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలి. ఏడవ నెల నుంచి తల్లిపాలతో పాటు అదనపు ఆహారం పెట్టాలి. ఈ సందర్భంగా అంగన్వాడి స్కూల్ నందు అన్నప్రాసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ పరిగి,అంగన్వాడీ టీచర్స్ ఉలింగ ధనలక్ష్మి, తారాబాయి, మాధవి, ఏఎన్ఎంస్ మీనా, లలిత, విమల, విద్యార్థులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, ప్రజలు పాల్గొన్నారు