
19న కలెక్టరేట్ ముందు జరిగే దీక్షను జయప్రదం చేయండి సి ఐ టి యు
పయనించే సూర్యుడు మార్చి 17 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందుస్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఇల్లందు ప్రాజెక్టు నిరసన దీక్ష ను సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి ప్రారంభించారు .ఈ సందర్భంగా ఫాతిమా అధ్యక్షతన జరిగిన సభలో నబి పాల్గొని మాట్లాడుతూ. ఐసిడిఎస్ ను నిర్వీర్యం చేసే పిఎం శ్రీ పథకం మొబైల్ అంగనవాడి సెంటర్స్ ను రద్దు చేయాలని కేంద్రం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయకూడదని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కు కోర్టు తీర్పుల ప్రకారం గ్రాట్యూటీ, పీ ఎఫ్ వర్తింపు పర్మనెంట్ చేయాలని. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన 18000 వేతనం పిఎఫ్ సౌకర్యం కల్పించాలని మినీ టీచర్స్ కు పది నెలల బకాయిలు వేతనాలు వెంటనే చెల్లించాలని వారికి హెల్పర్స్ను నియమించాలని మంత్రి సీతక్క హామీ ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ కొత్త జీవో ఇవ్వాలని ఎలాంటి షరతులు లేకుండా రిటైర్ అయిన వారికి ఆసరా పెన్షన్ అమలు చేయాలని కోరుతూ సోమవారం, మంగళవారం నిరసన దీక్షకు యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందనిఅందులో భాగంగా సోమవారం ఇల్లందు ఎమ్మార్వో ఆఫీస్ ముందు నిరసన దీక్ష రేపు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన దీక్ష కార్యక్రమాన్ని జరపతలిపెట్టామని రేపటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తాళ్లూరి కృష్ణ , ప్రాజెక్టు కార్యదర్శి కల్లేపల్లి, మరియా, సిహెచ్ రాంబాయి, ఆలేటి సంధ్యా, బత్తుల దేవేంద్ర, సుభద్ర, వనజ, సోమలక్ష్మి, దేవమణి ,దీప్తి, దయావతి , ఆంధ్రజ్యోతి, యాకమ్మ, తదితరులు పాల్గొన్నారు.