డిఎస్పీ ఎన్.లింగయ్య.
//పయనించే సూర్యుడు// సెప్టెంబర్26// మక్తల్
మక్తల్. అంతరాష్ట్ర ముగ్గురు దొంగల ముఠాను అరెస్టు చేసి వారి నుంచి నాలుగు లక్షల విలువైన ఐదు షైన్ బైకులను స్వాధీనం చేసుకున్నట్టుగా నారాయణపేట డిఎస్పి లింగయ్య తెలిపారు.శుక్రవారం మక్తల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ ఎన్ లింగయ్య మాట్లాడుతూ పట్టణానికి చెందిన రెహమాన్ అనే వ్యక్తి ఇటివల ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంక్వయిరీ చేయగా కర్ణాటకకు చెందిన దుర్గాప్ప. ఎల్లప్ప.ముటాగా ఎర్పడి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ పరిధిలోని బైకులు దొంగతనం చేసి రాయిచూర్ లో బైక్ మెకానిక్ గా ఉన్న శంషోద్దీన్ కు అప్పగించగా ఆయన వీటిని అమ్మి పెట్టేవాడని తమ ఎంక్వయిరీలో తెలిందని డీఎస్పీ తెలిపారు .ఈ సెర్చ్ ఆపరేషన్ లో పనిచేసిన అశోక్.నరేష్. శశి.శ్రీకాంత్ కానిస్టేబుల్స్ కి రివార్డుకై పై అధికారులకు నివేదిక పంపుతున్నాను అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐ రామలాల్.మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

