
విద్యార్థినీ సన్మానించిన ఎంఈఓ మనోహర్
స్కూల్ చైర్మన్ భువనేశ్వర్ మరియు కరాటే మాస్టర్ సాయినాథ్ యాదవ్
( పయనించే సూర్యుడు ఆగస్టు 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఇండియన్ హై స్కూల్ లో ఐదవ తరగతి చదువుతున్న హరీష్ కర్ణాటకలోని శివ మొగ్గలో జరిగే ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ సెలెక్ట్ అవడం జరిగింది. ఈరోజు స్కూల్లో జరిగిన కార్యక్రమంలో సెలెక్ట్ అయిన విద్యార్థికి ఫరూక్నగర్ ఎంఈఓ మనోహర్ సన్మానించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ లో పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచాలని మరియు ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. చదువుతోపాటు కరాటే కూడా విద్యార్థులకు ఎంతో అవసరం అని ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని ఎంఈఓ అన్నారు. కరాటే ద్వారా విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని ఎంఈఓ అన్నారు.అదే విధంగా కరాటే మాస్టర్ సాయినాథ్ యాదవ్ ను తో పాటు స్కూల్ యజమాన్యం అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ హైట్ స్కూల్ చైర్మన్ భువనేశ్వర్ , స్కూల్ డైరెక్టర్ మహేశ్వర్, డైరెక్టర్ విశ్వేశ్వర్, స్కూల్ ప్రిన్సిపాల్ నవీన్, వైస్ ప్రిన్సిపాల్ సునీత మరియు కరాటే మాస్టర్ సాయినాథ్ యాదవ్ పాల్గొన్నారు.
