
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతీయ స్టేట్ బ్యాంక్ తిరువూరు మెయిన్ బ్రాంచ్ లో నేడు ఎస్బిఐ శక్తి సమర్థ దివాస్ నిర్వహించారు.
పయనించే సూర్యుడు మార్చి 9 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. తిరువూరు, మునుకొల్ల, చిట్యాల తదితర గ్రామాల నుంచి వంద మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో తిరువూరు ఆర్డిఓ కుమారి కె మాధురి గారు విశిష్ట అతిధిగా పాల్గొని మహిళకు ఉచిత వైద్య పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు, ఇందులో తిరువూరు ప్రముఖ డాక్టర్ల టీము డాక్టర్ రామ కోటేశ్వర రావు గారు, డాక్టర్ సుజాత గారు, డాక్టర్ కార్తీక గారు మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొని సుమారు 47 మంది మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్డిఓ గారు 58 మంది మహిళా లబ్ధిదారులకు స్వయం సిధ్ధ ఋణములు 98 లక్షలు శాంక్షన్ లెటర్లను అందించారు. తిరువూరు మెయిన్ బ్రాంచి చీఫ్ మేనేజర్ పి రవి కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ గోపీనాద్, అకౌంటెంట్ శ్రావణి, కేష్ ఆఫీసర్ ప్రసాద్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు