
పయనించే సూర్యుడు న్యూస్ ; ఫిబ్రవరి 12 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండల అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద నిజామాబాద్ సిపి మరియు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సాలూర అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద కట్టుదిట్టమైన సిబ్బందితో కలిసి చర్యలు చేపట్టారు. చెక్ పోస్ట్ ల వద్ద పశు సంవర్ధక మరియు పోలీసులు శాఖలు కలిసి తెలంగాణలోకి కోళ్లను రానివ్వకుండా చెక్ పోస్ట్లు ల వద్ద వాహనాల తనిఖీ చేస్తున్నారు. బయట రాష్ట్రాల నుంచి కోళ్ల ను వెనక్కి పంపుతున్నారు. పశుసంవర్ధక శాఖ నుంచి ఆరుగురు సిబ్బంది చెక్ పోస్ట్ 24 గంటలు విధులు నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ జెడి జగన్నాథ చారి తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 15 కు పైగా ఫారాలలో బర్డ్ ఫ్లూ వంటి వైరస్ లక్షణాలతో సుమారు 60 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయని, చనిపోయిన కోళ్ల నుంచి నమూనాలు సేకరించి వారం క్రితం హైదరాబాద్ ల్యాబ్ లోకి పంపించారు. ఇంతవరకు ఏ వైరస్ అనేది ఇంకా నిర్ధారణ కాలేదని కోళ్ల ఫారాలలో జీవ సంరక్షణ చర్యల ద్వారా కొంతవరకు వైరస్ అదుపులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీచేసింది. కొన్ని రోజులు పాటు చికెన్ తినవద్దని సూచించింది. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని , ఇప్పటికే ఈ వ్యాధి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు వ్యాపించినందున . ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.