
పయనించే సూర్యుడు న్యూస్// నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ఇంచార్జ్ వడ్ల శ్రీనివాస్ 21 తేదీ మార్చి
జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధం అవుతున్న విద్యార్థిని, విద్యార్థులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు విద్యార్థులందరూ ఏకాగ్రతతో చదివి పరీక్షలు మంచిగా వ్రాయాలని, కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్న తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మీ పాఠశాలలకు, మీ గ్రామానికి, డలానికి,నియోజకవర్గానికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. విద్యార్థులందరూ సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని,ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు వ్రాసి మంచి ఫలితాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు బైక్ లిఫ్ట్ అడిగితే ఇవ్వండి. సకాలంలో ఎగ్జామ్ సెంటర్ల దగ్గర విద్యార్థులను దింపి సహకరించండి అని కోరుచున్నాను. విద్యార్థిని, విద్యార్థులకు *తెలియజేయునది ఏమనగా మీకు ఏదైనా అత్యవసరం ఉన్న నాకు తెలుపగలరు. గమనిక పరీక్ష కేంద్రానికి 30 నిమిషాల ముందుగా చేరుకోవాలి *పరీక్ష రాయడానికి కావలసిన సామాగ్రిని (హాల్ టికెట్ ,పెన్ను, పెన్సిల్, స్కేలు ,రబ్బర్ ,షార్ప్నర్) కచ్చితంగా తీసుకొని వెళ్ళాలి మంజునాథ్_బిజెవైయం