
పయనించే సూర్యుడు // ఏప్రిల్// 3 // హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ // కుమార్ యాదవ్..
ఎఐసిసి మరియు టి పిసిసి పిలుపు మేరకు ఇల్లందకుంట మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమం కనగర్తి మరియు లక్ష్మాజిపల్లి గ్రామాల్లో నిర్వహించడం జరిగింది. దేశ వ్యాప్తంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామం నుంచి లక్ష్మాజీపల్లి గ్రామం వరకు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టడం జరిగింది. మొదట అంబేద్కర్, గాంధీ,చిత్ర పటాలకు పూలమాలలు వేసి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని గ్రామస్తులందరితో ప్రతిజ్ఞ చేపించారు. తదనంతరం నాయకులు మాట్లాడుతూ..అహింసా పద్ధతిలో పోరాటం చేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచి స్వాతంత్రం సిద్ధింపచేసిన మహాత్మా గాంధీతో పాటు ప్రజల స్వేచ్ఛ సమానత్వం కోసం రాజ్యాంగం రచించిన అంబేద్కర్ లను బిజెపి ఆర్ఎస్ఎస్ అవమాన పరుస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అన్నారు.. మహనీయుల ఆశయాలను కాపాడటంతో పాటు ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాంగ్రెస్ అగ్రనేత లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ అభియాన్ ర్యాలీ నిర్వహిస్తుందన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడడానికి ప్రజల హక్కులను పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలు గ్రామాలలో సామాజిక న్యాయం ఐక్యత కల్పించే ప్రధాన ఉద్దేశంతో రాజ్యాంగ పరిరక్షణ రాష్ట్రీయ పాదయాత్ర చేస్తున్నామని అన్నారు. ఈ పాదయాత్ర ద్వారా రాజ్యాంగ గొప్పతనాన్ని ప్రజలకి తెలియజేయడంతో పాటు మహనీయులను స్మరించేందుకు వారు చేసిన సేవలోను నేటి తరానికి తెలియజేయపరిచే ఉద్దేశంతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెపు సారంగపాణి, తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్, గ్రామ శాఖ అధ్యక్షులు మిట్ట మోహన్ రావు, బండి మల్లయ్య, మట్ట రాజు, రామంచ రాజు, మల్లేష్, శ్రీనివాస్ రెడ్డి,ఓదెలు, వీరారెడ్డి, రాజు, వెంకటేష్, మల్లారెడ్డి, రజిత, మానస, రవి,సాయి, మహేష్, సదానందం, స్వామి, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.