దుఃఖసాగరంలో కుటుంబ సభ్యులు.
పయనించే సూర్యడు న్యూస్.
కొయ్యురు జనవరి 31.
రిపోర్టర్ 🙁 చల్లంగి వినోద్ )
సమాజం లో తల్లిదండ్రులకూ, పిల్లలకు మధ్య బంధం చాలా భావొద్వేగభరితం. తల్లిదండ్రులు ఎన్ని కష్టాల్లో వున్నా పిల్లల భవిష్యత్ మెరుగు పరచాలి, పిల్లలు వారి కాళ్లపై నిలపడి అలాగే ఇతరులపై ఆధారపడకుండా స్వతహగా జీవనం సాగిస్తూ…. వృధాప్యం లో తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుతారు అనే గంపేడు ఆశలతో జీవనం సాగించే తరుణం లో చేతికి అంది వచ్చిన కుమారుడు అదృశ్యం అవ్వడం తో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతం అవుతున్నారు. వివరాలలోకి వెళితే… బోడసింగి. రాఘవ, సత్యవతి మొదటి కుమారుడైన దుర్గా ప్రసాద్ గత మూడు రోజులుగా ఆచూకీ లభించ లేదని, దుర్గాప్రసాద్ వయస్సు 25 సం లు అని, స్వగ్రామం ఏలేశ్వరం ప్రస్తుతం అల్లూరిజిల్లా, కొయ్యురు మండలం, నడింపాలెం గ్రామంలో కుటుంబం వుంటున్నారని, ఇక్కడినుంచి 2 సంవత్సరాల క్రితం విశాఖపట్నం నూడిల్స్ పాయింట్ వద్ద జీతానికి చేరాడని కుటుంబ సభ్యలు తెలిపారు. ఈ క్రమంలో విశాఖపట్నం హోటల్ యాజమాన్యం ఇక్కడ నుంచి మంచిర్యాల వెళ్లి వారి వేరే శాఖకు వెళ్లి అక్కడ పనిచెయ్యాలని ఆదేశించడం తో గత మూడు రోజుల క్రితం రైలుపై విజయవాడ కు చేరుకున్నాడని అక్కడ నుంచి అతడి ఆచూకీ లేకపోవడం తో అతడి సహచరులకి, బంధువులకి,అలాగే విజయవాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్టు తెలపడం జరిగింది.అయినా ఇంకా ఆచూకీ లభించలేదని తల్లి దండ్రులు పత్రికా ముకంగా ఆవేదన వ్యక్తం చేసారు.దుర్గాప్రసాద్ ఆచూకీ లభించినవారు 8121432121 నెంబర్ కి ఫోన్ చేసి ఆచూకీ తెలుపగలరని కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.