
హోళి సంబరాలు జరుపుకుంటున్న దృశ్యం..
రుద్రూర్, మార్చ్ 13 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం(ఆర్) గ్రామంలో గురువారం గ్రామస్తులు, యువకులు, చిన్నారులు హోళి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. యువకులు, చిన్నారులు ఒకరి పై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాల మధ్య హోళి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.