
ఫోటో: సన్న బియ్యం పంపిణీ చేస్తున్న దృశ్యం…
రుద్రూర్, ఏప్రిల్ 2 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండలం అం బం (ఆర్) గ్రామంలోని రేషన్ దుకాణంలో బుధవారం గ్రామానికి చెందిన బిజెపి నాయకులు సన్న బియ్యాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పేదలకు ఇస్తున్న ప్రతి కిలో బియ్యం మీద కేంద్రం 40 వేల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. తెలంగాణలోని పేదల కోసం ఏడాదికి కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని పేదలందరికీ ఉచితంగా రేషన్ బియ్యం ఇస్తున్న విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు కమ్మరి రవి, కుర్లేపు గంగాధర్, రేపల్లి సాయి ప్రసాద్, కుర్మ భూమయ్య, బడే వినోద్, మూఢ నవీన్, కోర్వ సాయితేజ తదితరులు పాల్గొన్నారు.