
పయనించే సూర్యుడు. ఏప్రిల్ 14. ఖమ్మం జిల్లా బ్యూరో ఇంచార్జ్ గుగులోత్ భావుసింగ్ నాయక్
- ఖమ్మం జిల్లా దిశ కమిటీ సభ్యులు బాదావత్ బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది
- రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి.
- డాక్టర్, బి.ఆర్. అంబేద్కర్
ఘనంగా 134వ జయంతి వేడుకలు.
అంబేద్కర్ ఆశయ సాధనకొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఏన్కూరు మండలం బిఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది రాజ్యాంగ నిర్మాత బి.ఆర్ అంబేద్కర్ జయంతి ని ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కూరాకుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, అంటరానితనాన్ని, సామాజిక వివక్షకు గురవుతున్న వర్గానికి సమాన వాటా కోసం,సామాజిక న్యాయం కోసం తన జీవితకాలం పోరాడిన దార్శనికుడు అని కొనియాడారు.భారతదేశ స్వపరిపాలన అందించాలనే ఉద్దేశంతో నిరంతరం శ్రమించిన యోధుడని, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడు.ఆయన రాజ్యాంగ రూపకల్పన చేసినందుకే ఈనాడు ప్రతి యెక్క గిరిజన ప్రజలు ఏజెన్సీ ప్రాంతంలో తన హక్కుల కోసం ప్రశ్నించే దైర్యం వచ్చిందని గుర్తుచేశారు.యువత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని సమాజానికి ఉపయోగ పడే విధంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అజ్మీర రైలు
మాట్లాడుతూ ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటమని, భారత రాజ్యాంగ రూపకర్త 1891 ఏప్రిల్ 14న జన్మించారని వారి జన్మదిన రోజుని భారతదేశంలో సమానత్వ దినోత్సవంగా కూడా జరుపుకుంటారని తెలియజేశారు. భారత రాజ్యాంగం నవనిర్మాత, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, అలుపెరగని పోరాట యోధుడని,సంఘసంస్కర్త అని, రాజకీయవేత్త న్యాయకొవిదుడని ,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అస్పృశ్యత అంటరానితనం గురించి పోరాడుతూనే భారత దేశంలో సబ్బండ వర్గాలకు సమన్వయ న్యాయం భారత రాజ్యాంగ ద్వారా భారతదేశం నుదుటి రాతను మార్చిన గొప్ప మహనీయుడని కొనియాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రెండు సంవత్సరముల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని రచించారని గుర్తు చేశారు. రాజ్యాంగం వల్లనే మానవ హక్కులు, రిజర్వేషన్లు పొందుతున్నామని, తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా దిశ కమిటీ సభ్యులు బాదావత్ బాలాజీ కూరాకుల వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్ దేవదాస్ శివ రైలు భాష బింజా నాయక్ బాబు బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు ఇటికల రాజు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
