
పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్, బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం ఎంపీపీ తూమాటి విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు . స్థానిక గ్రామ సచివాలయం లో పంచాయతీ కార్యదర్శి శ్రీను ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఈఓపిఆర్డి రామయ్య,ఇంజనీర్ అసిస్టెంట్ హరీష్, 9 వార్డ్ నెంబర్లు సోమవరపు సంగీత,షేక్ రజాక్,హజరత్ బాబు, గ్రామస్తులు ఆత్మకూరు అనూర,బి నాగేంద్ర రెడ్డి, ప్రకాష్,వెంకటరమణ,బుడ్డయ్య,రాఘవులు,తదితరులు పాల్గొన్నారు.