
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 30 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు మండలంలో ఇటీవల కురిసిన అతిభారీ వర్షాలకు పంట పొలాలు వాగులను తలపించేలా మారాయి. ఎన్నో ఆశలతో పంటలను వేసిన రైతులకు ఈ భారీ వర్షం కన్నీరె మిగిల్చింది. చేతికి వచ్చిన పంట నీటమునిగి పోవడంతో రైతులకు అపార నష్టం కలిగింది. అటువంటి రైతులను ప్రభుత్వం గుర్తించి నష్ట పరిహారం ఇప్పించాలని రైతులు అధికారులను వేడుకుంటున్నారు.