
పంటలను పరిశీలించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
అధికారులు పంట నష్టాన్ని అంచనా వెయ్యాలి.
పంట నష్టాన్ని ప్రభుత్వం భరిస్తుంది ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..
( పయనించే సూర్యుడు మే 2 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం వ్యాప్తంగా నిన్న రాత్రి భారీ వడగండ్ల వాన కురిసింది. వడగళ్ల వానకు చేతికొచ్చిన పంటలు నేళ్ల రాళ్ళడంతోపాటు తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతులు ప్రభుత్వ ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఆరుకాలం శ్రమించి పంట చేతికొచ్చిన సమయంలో ఇలా అకాల వర్షానికి పంట నష్టపోవడంతో రైతులు లబోదివ్వమంటున్నారు. మండలంలో ముఖ్యంగా కడియాల కుంట తండా, బూర్గుల, తిమ్మాజీ పల్లి, చిలుకామర్రి, కాశిరెడ్డి గూడ, తదితర గ్రామాల్లో భారీగా నష్టం జరిగింది. వరి పంట తో పాటు మామిడి తోటలు దారుణంగా దెబ్బతిన్నాయి. అయితే అయితే పలు గ్రామాల్లో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పర్యటించి రైతులకు భరోసాని ఇచ్చారు. తడిసిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వమే ఉంటుందని రైతులను ఆదుకుంటామని భరోసానిచ్చారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వనికి పంపాలని రైతులకు నష్టపరిహారం అందజేస్తమని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ప్రతి గ్రామంలో ఎంత మేరకు వర్ష ప్రభావం వల్ల పంట నష్టం జరిగిందో తెలుసుకోవాలని అధికారులకు ఆదేశాలను ఇచ్చారు.
