
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 7
అక్రమంగా తరలిస్తున్న 347 తాబేళ్లను అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఆటనీ డివిజన్, లక్కవరం రేంజీ పరిధిలోని తులసిపాక గ్రామ శివారు ప్రాంతంలోని సోకిలేరు బ్రిడ్జ్ వద్ద బుధవారం ఉదయం అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు,లక్కవరం రేంజ్ అటనీ క్షేత్రాధికారి గవిరెడ్డి వెంకట నానాజీ తెలిపిన వివరాల ప్రకారం అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుంచి ఒడిశా రాష్ట్రానికి ఆటోలో తరలిస్తున్న పన్నెండు బస్తాల్లోని 347 తాబేళ్లను అధికారులు పట్టుకున్నారు,ఆటో తాబేళ్లను స్వాదీనం చేసుకుని, అవబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ఏరుపల్లి గ్రామంలో రంగోలి పోడి విక్రేత నెల్లూరి శ్రీనుని అరెస్టు చేశారు,స్వాధీనం చేసుకున్న 347 తాబేళ్లులో 65 తాబేళ్లు చనిపోయాయి వాటిని చెక్పోస్టు సమీపంలో అటవీ ప్రాంతంలో దహనం చేశారు
బ్రతికున్న 282 తాబేళ్లను చింతూరు శబరి నదిలో విడిచిపెట్టినటు పేర్కొన్నారు,ఈ దాడిలో ఎఫ్ఎస్్వ విజయ్కుమార్, ఎఫ్ బీ వో లు సరిత, కుమారి, హెల్పర్లు పాల్గొన్నారు
