
సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి ఎన్ రాజు
ఉచిత పథకాల కోసం యూనివర్సిటీ భూముల వేలం ఒక నియంతృత చర్య..
ఈ ముందస్తు అరెస్టులను సిపిఎం షాద్నగర్ డివిజన్ కమిటీ ఖండిస్తుంది
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 1 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ యు సి) 400 ఎకరాల భూమి అమ్మకాన్ని ఆపాలని పోరాడుతుంటే ఆ విద్యార్థులను ముందస్తు అరెస్టు చేయడం దుర్మార్గం అని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి ఎన్ రాజు అన్నారు ఈరోజు సిపిఎం పార్టీ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న భూములను కాపాడాలని చలో సెంట్రల్ యూనివర్సిటీ కార్యక్రమాన్ని పోలీసులు ముందస్తు అరెస్టు చేయడానికి వారు తీవ్రంగా విమర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గత తెరాస ప్రభుత్వం పదేళ్ల పాలనలో వేల కోట్ల రూపాయల అప్పులు చేసి అభివృద్ధికి కాకుండా ఖర్చులకు దారి మళ్లించి ఇప్పుడు నా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అప్పుల భారం తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం భూములు అమ్ముతూ ప్రజలను మోసం చేస్తుంది ప్రయత్నం చేస్తుంది భవిష్యత్ తరాలను దృష్టిలో పెంచుకొని సెంట్రల్ యూనివర్సిటీ ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి యూనివర్సిటీ భూములను కాపాడడం కోసం ప్రజలు ప్రజాసంఘాలు విద్యావంతులు మేధావులు ఐక్యంగా పోరాటాలు నిర్వహించి యూనివర్సిటీ భూములను కాపాడే విధంగా పోరాటాలు నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు శ్రీను నాయక్ ఈశ్వర్ రాయి కంటి గోపాల్ తదితరులు అరెస్టు చేసిన వారిలో ఉన్నారు