
పయనించే సూర్యుడు// న్యూస్// మార్చ్ 23// మక్తల్ రిపోర్టర్ సీ తిమ్మప్ప //
తెలంగాణ రాష్ట్రంలో వివిధ రంగాలలో అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ధర్నాలు ఆందోళనలు నిర్వహిస్తున్నది. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి గోవింద్ రాజ్, సిపిఎం మండల నాయకులు ఎల్లప్పను అక్రమంగా ఈరోజు ఉదయం దాసరి దొడ్డి గ్రామంలో ముందస్తు హౌస్ అరెస్ట్ చేయడం. నిరంకుశ పాలనకు నిదర్శనమని విమర్శించారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించకుండా కార్మిక నేతలను అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. ఈరోజు మక్తల్ మండలంలోని దాసరి దొడ్డి గ్రామంలో సిఐటి సిపిఎం నేతలను పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ చేయడం ఏమైనా చర్యని విమర్శించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక నేతలను అరెస్టు పైన ప్రభుత్వం దృష్టిపెట్టడం కంటే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు
