
ప్రయాణించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 1
మంగళవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్-ASP (274/16) మరియు ఆదివాసి విద్యార్థి సంక్షేమ పరిషత్- AVSP ఆధ్వర్యంలో చింతూరులో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆదివాసులు కల్పించిన చట్టాలు అమలు అవ్వాలన్నా, హక్కులు దక్కలన్నా చదువుకున్న యువత మేలుకోవాలని, గ్రామస్థాయి నుంచి యువత ఉద్యమానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొనసాగుతున్న అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియను ఉద్దేశించి మాట్లాడుతూ, అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియలో ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలను ధిక్కరిస్తూ స్థానిక పంచాయతీ, రెవెన్యూ అధికారులు సొంత పెత్తనాలు చేస్తున్నారని, అంతేకాక నాన్ ట్రైబల్స్ కి అనుకూలంగా సపోర్ట్ చేస్తూ ఏజెన్సీ చట్టాలను అమలు చేయకుండా అక్రమ కట్టడాలను కూల్చకుండా చాలా చోట్ల మార్కింగ్ లు వేసి నిలుపుదల చేశారని విమర్శించారు. మిగతా చోట్ల అక్రమ కట్టడాలు కార్యక్రమం కొనసాగుతున్న చింతూరులో మాత్రం అక్రమ కట్టడాలు కూల్చకపోవటం గల కారణాలేమిటో తెలియజేయాలని పంచాయతీ రెవెన్యూ మరియు ఐటీడీఏ అధికారులను ఆయన ప్రశ్నించారు. అక్రమ కట్టడాలు కూల్చకుండా ఉండటానికి అధికారులకు భారీ ఎత్తున నాన్ ట్రైబల్స్ నుండి ముడుపులు ముట్టినట్లు ఆయన ఆరోపించారు. అధికారులు ఏమాత్రం నిజాయితీపరులైన, తమ చిత్తశుద్ధిని చూపించాలని తక్షణమే చింతూరు తో పాటు డివిజన్లోనితో నాలుగు మండలాల్లో గల అక్రమ కట్టడాలను తక్షణమే కూల్చివేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొందరు అధికారులు గిరిజనయేతర స్థిర నివాసాలు వ్యాపార సముదాయాలు పోకుండా ఉండటానికి ఆదివాసులు (బినామీలు) పేరుతో కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్స్ తెచ్చుకొండి అనీ నాన్ ట్రైబల్స్ కి సలహాలిస్తున్నారని మండిపడ్డారు. న్యాయస్థానం జీ ఓ 3 ని రద్దు చేస్తే ఆ నిబంధనలను తూచా తప్పకుండా పాటించి ఆదివాసిల ఉద్యోగ ఉపాధి ఫలాలను దూరం చేసిన అధికారులకు, అదే చిత్తశుద్ధి అదే న్యాయస్థానాలు ఇచ్చిన అక్రమ కట్టడాలు కూల్చివేత ఉత్తర్వులను ఎందుకు తూచా తప్పకుండా పాటించడం లేదో తెలపాలని ప్రశ్నించారు. ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఆదివాసులకి వ్యతిరేకంగా ఉన్న ఉత్తర్వులు మాత్రం తక్షణమే అమలు చేస్తారని, అదే నాన్ ట్రైబల్స్ కి వ్యతిరేకంగా ఏదైనా ఉత్తర్వులు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఆ ఉత్తర్వులను సంబంధిత జీవో లను, మరియు సంబంధిత చట్టాలను నీరుగార్చచడంలో ముందుంటారని విమర్శించారు. ఇటువంటి అధికారులకు తోడుగా ఆదివాసి రిజర్వేషన్ మరియు ఆదివాసి ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులు అండగా ఉంటూ ఆదివాసులకు ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఏది ఏమైనప్పటికీ అక్రమ కట్టడాలను కూల్చే వరకు, వలస నాన్ ట్రైబల్స్ ను ఏజెన్సీ నుండి తరిమే వరకు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉద్యమం ఆగదని తెలియజేశారు. అధికారులు ఇప్పటికైనా అక్రమ కట్టడాలు కూల్చివేత చింతూరు డివిజన్లో ప్రారంభించాలని ముంపు పేరుతో వరదలు పేరుతో సత్కారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కరోనా టైం లో ఒకపక్క జనాలు చనిపోతుంటే అదే టైం ని అదునుగా చూసుకొని నాన్ ట్రైబల్స్ అందరూ ఏకమై పెండింగ్లో ఉన్న జీవో నెంబర్ 3 వ్యతిరేక కేసును వెలికి తీసి కుట్రతో రద్దు చేయించారని, అప్పుడు ఆదివాసులపై లేని మానవత్వం, ఇప్పుడు వరదల పేరుతోటి ముంపు పేరుతోటి నాన్ ట్రైబల్స్ పై ఎందుకు చూపిస్తున్నారో దాని వెనుక పరమార్థం ఏంటో తెలపాలని ప్రశ్నించారు. అతి త్వరలోనే అక్రమ కట్టడాలు కూల్చివేత ప్రక్రియ వేగవంతం చేయాలని తీవ్రస్థాయి ఉద్యమం మొదలవుతుందని ఆ తర్వాత జరిగే పరిణామాలకు అధికారులు, ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చింతూరు ఐటీడీఏ పీవో గారికి మరియు చింతూరు ఎమ్మార్వో గారికి కోర్టు నిబంధనలపై చిత్తశుద్ధి లేదు గానీ ఒరిస్సా నుంచి వలస వచ్చి తాము పోర్జా ST లమని, మాకు ఎస్టి ధ్రువపత్రాలు ఇవ్వాలని వలసవాదులు రాజకీయం చేస్తుంటే వాళ్లకు మాత్రం తక్షణమే ఎస్టి కుల దృవీకరణ పత్రాలు ఇవ్వాలని ఆదేశిస్తున్నారని అన్నారు. పొర్జా లు వాస్తవానికి ఒరిస్సా రాష్ట్రంలో ST లే కానీ మోతుగూడెం ప్రాంతంలోకి వలస వచ్చిన వాళ్ళు నిజమైన ST పార్జా తెగలే అని అధికారుల దగ్గర ఏమి ఎవిడెన్స్ ఉన్నాయో తెలపాలన్నారు. మామూలుగా సొంత రాష్ట్రంలోని మైదా న ప్రాంతంలనుండి ఏజెన్సీ ప్రాంతాలకు వలసలు వచ్చిన నాన్ ట్రైబల్స్ రెవిన్యూ అధికారులకు తప్పుడు ధృవపత్రాలు చూపిస్తూ, రాజకీయ పార్టీల సహకారంతో నకిలీ ఎస్టి దృవపత్రాలు పొందుతున్నారని, అలాంటిది ఒరిస్సా నుండి వచ్చి తాము ఎస్టీలమే అంటే వెంటనే వాళ్ళకి ధ్రువపత్రాలు ఇవ్వటానికి అధికారులకు ఎందుకంత ఉత్సాహం అర్థం కావట్లేదు అన్నారు. గతంలో కూడా ఇలాగే రాజకీయ నాయకుల తోటి ఎస్టీ దృవపత్రాలు కోసం గతంలోని అధికారులను ఒత్తిడి చేస్తే అప్పుడు కూడా ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసి నిలుపుదల చేయడం జరిగిందని, మళ్లీ కొత్తగా ఇప్పుడు వచ్చిన అధికారులు వాళ్లకి ఎస్టీ దృపత్రాలు ఇవ్వాలని చూడటం సరికాదని అన్నారు. ఒకరు ఇద్దరికీ ఇవ్వటం మొదలుపెడితే భారీగా వలసలు మొదలై అందరికీ ఎస్టీ ధ్రువపత్రాలు ఇవ్వాల్సి ఉంటుందని, ఈ ఆలోచనను విరమించుకోకపోతే ఎస్టీ ధ్రువపత్రాలు జారీ చేసే అధికారులకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో అలా చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కట్టం కిరణ్ బాబు, ముర్రం సురేష్, గాలి శ్రీకాంత్, సున్నం కృష్ణ, పీసం సంతోష్ తదితరులు పాల్గొన్నారు
