
పయనించే సూర్యుడు న్యూస్// నారాయణపేట జిల్లా 21 తేదీ మార్చి వడ్ల శ్రీనివాస్
దేశ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ పథకాన్ని రెగ్యులరైజ్ చేసి ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26 వేల రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని నారాయణపేట జిల్లా ఆశా యూనియన్ కోటకొండ పీఠామిక ఆరోగ్య కేంద్రం ఆశా యూనియన్ నాయకులు రాధిక డిమాండ్ చేశారు.
శుక్రవారం రోజు నారాయణపేట మండల పరిధిలోని కోటకొండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ప్లే కార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు .
నిరసన కార్యక్రమంలో ఆశలను ఉద్దేషించి ప్రసంగించారు 45వ మరియు 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసుల ప్రకారం పెన్షన్ సామాజిక భద్రత ప్రయోజనాలను ఆశా కార్యకర్తలు కల్పించాలన్నారు. కరోనా కట్టడిలో ఆశ కార్యకర్తలు తగిన రక్షణ కవచాలు లేకున్నా తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ ప్రజల ప్రాణాలను కాపాడినారన్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆశా కార్యాకర్తలను గ్లోబల్ లీడర్ గా గుర్తించిందన్నారు . జాతీయ ఆరోగ్యం మీషన్( NHM) పరిధిలో దేశ వ్యాప్త 10 లక్షలు 9 వేల మంది ఆశలు పనిచేస్తున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఒకే విధమైన పని పరిస్థితులను అమలులోకి తీసుకురావాలన్నారు. వేతనంతో కూడుకున్న ప్రసూతి సెలవులు 20 రోజుల క్యాజువల్ లీవులు వైద్య సెలవులు అమలు చేయాలన్నారు.
సీనియార్టీ ప్రకారం ఆశలను ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడుకున్న అవినీతిపత్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రతిభ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ నాయకులు నాగమణి, బాల నర్సమ్మ, నర్మద,అంజమ్మ, భాగ్యమ్మ అనురాధ, ,తదితరులు పాల్గొన్నారు