
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్13(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో చందన ప్రాంతంలో నివాసముంటున్న వలిపి రెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి, భార్య పార్వతి కుమారులు సాయినాథ్ రెడ్డి, గణేష్ రెడ్డి కూతురు ప్రశాంతి, అల్లుడు సుధీర్ రెడ్డి మనవరాలు శాన్వి వీరి కుటుంబము అగాపే ఆశ్రమంలోని నిరాశ్రయులకు అన్నదానం ఏర్పాటు చేశారు.ఎంతోమంది ఆశ్రమంలోనికి వచ్చి అన్నదానం చేస్తున్నారు.ఏ సందర్భము లేకపోయినా పెట్టాలి అని ఆశ మాలో కలిగింది. అందుకే వెంటనే అగాపే ఆశ్రమంలో ఉంటున్న వారందరికీ భోజనాలు సిద్ధపరిచి కుటుంబమంతా కలిసి అన్నదానము చేశారు.వారి బంధుమిత్రులు కూడా పాల్గొన్నారు.ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.
