
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 8 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో యాడికి వాస్తవ్యులు రాచమల్లు నాగలింగేశ్వర్ రెడ్డి, భార్య లక్ష్మీదేవి వారి 38వ పెళ్లిరోజు శుభ సందర్భముగా ఆశ్రమంలో ఉన్న వారందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు.కుమారుడు శ్రవణ్ కుమార్ రెడ్డి, కోడలు ప్రశాంతి, మనవడు అనిశ్ రెడ్డి, కూతురు ప్రియాంక, అల్లుడు విజయ్ కాంత్ రెడ్డి వారి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.మేము ఈ రీతిగా మా పెళ్ళి రోజున కుటుంబముతో కలిసి అగాపే ఆశ్రమంలో అన్నదానం చేయడం మాకు ఆశీర్వదకరమని ఎంతో సంతోషించారు. ఇందు నిమిత్తమై ఆశ్రమ పౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసి వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.
