
పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 20(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండలం కమలపాడు రోడ్డు రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. 1సంవత్సర క్రితం పెన్నా కాలేజీ ద్వారా మహాబలిపురానికి ట్రిప్ కు వెళ్ళిన స్టూడెంట్స్ లలో ఇద్దరు స్టూడెంట్స్ పెద్దవడుగూరు మండలం అప్పిచెర్ల శేషారెడ్డి యాడికి మండలం కుందనకోట పెద్దిరాజు సముద్రంలో చనిపోవడం మనకందరికీ తెలిసిందే. వారి స్నేహితులు వీరన్న పల్లె కమలేశ్వర్ మహేష్ రెడ్డి పవన్ కళ్యాణ్ వీరు తమ స్నేహితుల జ్ఞాపకార్థమై అగాపే ఆశ్రమానికి 2 నెలల సరిపడా నిత్యవసర సరుకులు అందజేశారు.ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్ మాట్లాడుతూ, సొంత వారి కోసం ఏమీ చేయలేనట్టు వంటి సమాజంలో స్నేహితుల కోసం, ఇంత దాతృత్వం నేనెక్కడ చూడలేదని వారిని ప్రశంసించారు.ఇందు నిమిత్తమై ఆశ్రమంలోని వారంతా వారికి వారి స్నేహానికి కృతజ్ఞతలు తెలిపారు.